Kamsahamnida Song Promo | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). ఇండో-కొరియన్ నేపథ్యంలో హారర్-కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను చిత్ర బృందం ఘనంగా ప్రారంభించింది. ఈ చిత్రంలోని మొదటి పాట ‘కమ్సాహంనిదా’ (Kamsahamnida) ప్రోమోను తాజాగా విడుదల చేయగా, దీనికి విశేష స్పందన లభిస్తోంది. సంగీత దర్శకుడు ఎస్. థమన్, వరుణ్ తేజ్ మరియు దర్శకుడు మేర్లపాక గాంధీ మధ్య సాగే ఫన్నీ సంభాషణలతో కూడిన ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. మెలోడీ కింగ్ సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పూర్తి పాటను ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, స్టార్ కమెడియన్ సత్య కీలకమైన వినోదాత్మక పాత్రలో అలరించనున్నారు. కొరియా సంస్కృతికి మరియు లోకల్ క్యారెక్టర్ అయిన కనకరాజుకు మధ్య ఉన్న విచిత్రమైన సంబంధాన్ని దర్శకుడు మేర్లపాక గాంధీ తన మార్కు వినోదంతో వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడు. ఇప్పటికే మేజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఆఖరి షెడ్యూల్‌ను దక్షిణ కొరియాలోని అందమైన లొకేషన్లలో పూర్తి చేసుకోబోతుంది. యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్ మరియు విక్రమ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వరుస పరాజయాల తర్వాత వరుణ్ తేజ్ ఈ డిఫరెంట్ కథాంశంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాను 2026 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.