Siva Karthikeyan | స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ను మోసం చేసిన శివ కార్తికేయన్.. ఈ జన్మలో అతనితో సినిమా చేయనంటూ సంచలన వ్యాఖ్యలు..!
Siva Karthikeyan | డి. ఇమ్మన్ ఇలా పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు గానీ.. 'మైనా మైనా గుండెల్లోనా', 'చిన్నారి తల్లి', 'కరుకు చూపు కుర్రాడే' వంటి పాటల పేర్లు చెబితే ఇట్టే గుర్తుకొస్తాడు. తమిళంలో వందలాది సినిమాలకు పైగా సంగీతాన్నందించిన ఘనత ఈయనది.
Siva Karthikeyan | డి. ఇమ్మన్ ఇలా పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు గానీ.. ‘మైనా మైనా గుండెల్లోనా’, ‘చిన్నారి తల్లి’, ‘కరుకు చూపు కుర్రాడే’ వంటి పాటల పేర్లు చెబితే ఇట్టే గుర్తుకొస్తాడు. తమిళంలో వందలాది సినిమాలకు పైగా సంగీతాన్నందించిన ఘనత ఈయనది. అజిత్ హీరోగా నటించిన ‘విశ్వాసం’ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డును గెలుచుకున్నాడు. ప్రతీ ఏటా ఐదారు సినిమాలకు పాటలు కంపోజ్ చేస్తూ తమిళంలో తెగ బిజీగా గడుపుతుంటాడు. కాగా తాజాగా ఈ సంగీత దర్శకుడు హీరో శివ కార్తికేయన్‌పై చేసిన వ్యాఖ్యలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి.
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన శివ కార్తికేయన్‌పై డి. ఇమ్మాన్ తాజాగా ఓ ఇంటర్వూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. శివ కార్తికేయన్‌తో కలిసి ఈ జన్మలో పనిచేయనని.. ఆయనతో సినిమా చేయమని ఆఫర్ వస్తే క్షణం ఆలోచించకుండా తిరస్కరిస్తానని తెలిపాడు. శివ కార్తికేయన్‌తో డి. ఇమ్మన్ ఇప్పటివరకు ఐదు సినిమాలకు పనిచేశాడు. ఆ ఐదు మ్యూజికల్‌గా మంచి విజయాలు సాధించాయి. అంతేకాకుండా వీళ్ల కాంబినేషన్లో సినిమా వస్తుందంటే మ్యూజికల్‌గా ఆల్బమ్ సూపర్ హిట్టే అని తమిళ తంబీలు ఫిక్సయిపోతారట.
అలాంటిది గత కొన్నేళ్లుగా వీళ్లద్దరూ కలిసి పనిచేయడం లేదు. అప్పట్లో మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అయితే ఎంత మనస్పర్ధలు వచ్చినా కొంత కాలం తర్వాత మళ్లీ కలిసి పనిచేయడం విధితమే. అయితే ఇమ్మాన్ మాత్రం ఈ జన్మలో శివ కార్తికేయన్‌తో కలిసి సినిమా చేయనని, తన జీవితం పూర్తిగా మారిపోయేలా తను ద్రోహం చేశాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తనతో మాట్లాడట్లేదని, అయితే తాను ఏం ద్రోహం చేశాడో మాత్రం చెప్పలేనని, తన పిల్లల కోసం కొన్ని విషయాలు దాస్తున్నానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వచ్చే జన్మలో అతను నటుడు, తాను సంగీత దర్శకుడైతే కలిసి పని చేస్తాం కావచ్చు కానీ.. ఇప్పుడైతే పనిచేయనంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ఇమ్మాన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట చర్చనీయంగా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

