Vishal Wedding | కోలీవుడ్ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘పందెంకోడి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయిన విశాల్ ‘పొగరు’, ‘సెల్యూట్’, ‘డిటెక్టీవ్’, ‘అభిమన్యుడు’ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే సామాన్యుడు సినిమాతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ప్రస్తుతం ఈయన తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. విశాల్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలన్నాయి. తాజాగా లాఠీ షూటింగ్లో గాయపడిన విశాల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా విశాల్ ఓ ఇంటర్వూలో పెళ్ళిపై స్పందించాడు.
నడీగర్ సంఘానికి భవనం కట్టించాకే పెళ్ళి చేసుకుంటానని చెప్పిన విశాల్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా తనే చెప్పడం విశేషం. పెద్దలు కుదిర్చిన సంబంధాలు తనకు అచ్చిరావని, కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు. అంతేకాకుండా ప్రస్తుతం ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే ఆమె ఎవరనే విషయాన్ని బయటపెడ్తానని తెలిపాడు. ఇక గతంలోనే విశాల్ అర్జున్‌రెడ్డి, పెళ్ళి చూపులు వంటి సినిమాలలో మెరిసిన అనీషా అల్లారెడ్డితో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కారణాలేంటో తెలియదు కానీ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై వీరిద్ధరూ స్పందించి తాము కేవలం స్నేహితులమని పుకార్లలకు చెక్ పెట్టారు.