Vijay Thalapathy | కోలీవుడ్ స్టార్ విజయ్ ప్రస్తుతం స్పీడు మీదున్నాడు. వరుసగా కథలను ఓకే చేస్తూ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇటీవలే భారీ అంచనాలతో విడుదలైన ‘బీస్ట్’ తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకులే కాదు అభిమానులు కూడా ఈ చిత్ర ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయారు. ప్రస్తుతం ఈయన వంశీపైడిపల్లి దర్వకత్వంలో నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాడు. లేటెస్ట్గా విడుదలైన విజయ్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రానికి వారసుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈయన తాజాగా మరో సారి అరుదైన ఘనతను సాధించాడు.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతినెల సర్వే జరిపి ఇండియాలో అత్యధిక పాపులారిటీ కలిగిన హీరోల జాబితాను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల అభిప్రాయం ప్రకారం హీరోలకి ఈ ర్యాంకింగ్స్ కేటాయిస్తారు. తాజాగా ఈ సంస్థ టాప్-10 మోస్ట్ పాపులారిటీ హీరోల జాబితాను ప్రకటించింది. కాగా ఇందులో మొదటి ప్లేస్‌లో విజయ్ దళపతి ఉన్నాడు. తరువాతి రెండు స్థానాల్లో ప్రభాస్, యష్ ఉన్నారు. ఇందులో విచిత్రం ఏంటంటే బాలీవుడ్ నుండి కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే టాప్ 10లో ఉన్నాడు. కాగా ఏప్రిల్ నెలలో 2వ ప్లేస్‌లో ఉన్న తారక్ ఇప్పడు 6వ స్థానంలో చోటు దక్కించుకున్నాడు. 7వ స్థానంలో ఉన్న చరణ్ 9 స్థానానికి వెళ్ళాడు. ఇక ప్రభాస్ 3 నుండి 2 స్థానానికి వచ్చాడు. విజయ్ ఈ సారి కూడా మొదటి స్థానాన్ని ఆక్రమించాడు.