Ayalaan | శివకార్తికేయన్ ఆయలాన్ సినిమాకు రిలీజ్ కష్టాలు.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తుందా?
Ayalaan | తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఆయలాన్ సినిమా తెలుగు రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది. వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా తెలుగు వర్షన్ ఇప్పుడు తెలుగులో రిలీజ్ కావడం కష్టమని అనిపిస్తోంది. థియేటర్లో కాకుండా ఈ సినిమా నేరుగా ఓటీటీలోకే వచ్చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.
Ayalaan | తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఆయలాన్ సినిమా తెలుగు రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది. వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా తెలుగు వర్షన్ ఇప్పుడు తెలుగులో రిలీజ్ కావడం కష్టమని అనిపిస్తోంది. థియేటర్లో కాకుండా ఈ సినిమా నేరుగా ఓటీటీలోకే వచ్చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.
నిజానికి ఈ సినిమా సంక్రాంతికే తమిళంతో పాటు తెలుగులో విడుదల కావాల్సి ఉంది. అయితే సంక్రాంతికి టాలీవుడ్ నుంచే నాలుగు పెద్ద సినిమాలు ఉండటం వల్ల.. థియేటర్ల సర్దుబాటు కావకపోవడంతో డబ్బింగ్ సినిమాలను వాయిదా వేసుకోవాలని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సూచించారు. ఈ క్రమంలోనే ధనుష్ కెప్టెన్ మిల్లర్‌తో పాటు.. శివకార్తికేయన్ ఆయలాన్ సినిమా తెలుగు రిలీజ్ వాయిదా పడింది. ఈ వాయిదా పడిన డబ్బింగ్ సినిమాలను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న తీసుకొస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే కెప్టెన్ మిల్లర్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. కానీ ఆయలాన్ మాత్రం ప్రదర్శించబడలేదు. అదేంటని ఫ్యాన్స్ అడిగితే.. ఏవో ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది.. తొందరలోనే సినిమాను థియేటర్లో విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఇలా రిలీజ్ డేట్‌పై సందిగ్ధత కొనసాగుతున్న సమయంలోనే ఈ సినిమా ఓటీటీ ప్రకటన వచ్చేసింది.
ఆయలాన్ సినిమా ఓటీటీ రైట్స్‌ను సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను తొందరలోనే ఓటీటీలోకి తీసుకొస్తామని ప్రకటించి ఆశ్చర్యపరిచింది. అయితే ఫిబ్రవరి 16వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రకటించిన తేదీ కంటే వారం ముందే అంటే.. ఫిబ్రవరి 9వ తేదీనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయలాన్ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ ఉండకపోవచ్చే ఆడియన్స్ ఫిక్సవుతున్నారు. అయితే ఫిబ్రవరి 2వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం కూడా లేకపోలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే థియేటర్లో రిలీజైన వారంలోపే ఆయలాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏదేమైనా ఆయలాన్ సినిమా థియేటర్లోకి వస్తుందా? లేదా డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా? అనే సస్పెన్స్ వీడాలంటే మాత్రం కొద్దిరోజులు ఆగాల్సిందే.!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

