Kamal Haasan In Ponniyinselvan | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘పొన్నియిన్ సెల్వన్’ ఒకటి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులే కాదు సినీప్రముఖులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లతో సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. టీజర్‌తోనే మణిరత్నం సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాడు. తాజాగా ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ భాగం కాబోతున్నారు.
పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి కమల్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. కమల్ వాయిస్‌తో చిత్రం ప్రారంభమవుతంది. అంతేకాకుండా ఈ చిత్రంలోని ప్రతి పాత్ర కమల్ వాయిస్‌తోనే పరిచయమవుతుంది. ఈ చిత్రంలో కమల్ కూడా భాగమవడం సినిమాపై మరింత బజ్‌ను పెంచింది. చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కనుంది. మొదటి భాగం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.