నరేష్, అగస్త్య, అభినవ్ గోమటం, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కిస్మత్’. అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రను పోషిస్తున్నారు. శ్రీనాథ్ బాదినేని దర్శకుడు. రాజు నిర్మాత. ఆదివారం టీజర్‌ను విడుదల చేశారు. జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ చవిచూసిన ముగ్గురు చిన్ననాటి మిత్రులు తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని కోరుకుంటారు. ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని లైఫ్‌లో సెటిలైపోవాలనే నిర్ణయానికి వస్తారు. ఈ నేపథ్యంలో వారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? వారి కిస్మత్ (అదృష్టం) ఎలా మారిందన్నదే చిత్ర కథాంశమని, ఇందులో థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయని దర్శకుడు తెలిపారు. సరదా సంభాషణలతో సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇదని చిత్ర హీరోలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేదరామన్ శంకరన్, సంగీతం: మార్క్ కె రాబిన్, నిర్మాణ సంస్థలు: కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్, దర్శకత్వం: శ్రీనాథ్ బాదినేని.