ఈ రోజు వేడుకగా ఉంటుంది
బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్‌ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘బతుకమ్మ’ పాటకు అద్భుత ఆదరణ లభించిన విషయం తెలిసిందే. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ పాటను అందంగా దృశ్యమానం చేశారు. ఇదిలా వుండగా ఈ సినిమాలోని ఓ పాటలో తెలుగు అగ్ర హీరో రామ్‌చరణ్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారని వార్తలొచ్చాయి.
బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్‌ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘బతుకమ్మ’ పాటకు అద్భుత ఆదరణ లభించిన విషయం తెలిసిందే. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ పాటను అందంగా దృశ్యమానం చేశారు. ఇదిలా వుండగా ఈ సినిమాలోని ఓ పాటలో తెలుగు అగ్ర హీరో రామ్‌చరణ్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారని వార్తలొచ్చాయి. దీంతో అభిమానులు ఆ పాట ఎలా ఉంటుందోనని ఆతృతగా ఎదురుచూశారు.
మంగళవారం ఈ గీతాన్ని విడుదల చేశారు. ‘ఏంటమ్మా’ అంటూ తెలుగు పల్లవితో మొదలైన ఈ పాటలో సల్మాన్‌ఖాన్, వెంకటేష్, రామ్‌చరణ్ కలిసి స్టెప్పులేయడం ప్రధానాకర్షణగా నిలిచింది. తెలుగు, హిందీ లిరిక్స్ కలబోతగా ఈ పాట సాగింది. మధ్యలో వచ్చే ‘ఈ రోజు వేడుకగా ఉంటుంది’ అనే తెలుగు చరణాలు ఆకట్టుకున్నాయి. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లోని లుంగీ డ్యాన్స్‌ను స్ఫురిస్తూ ఈ పాట సాగింది. పసుపు అంగీ, తెలుపు లుంగీ ధరించి రామ్‌చరణ్ చివర్లో వేసిన స్టెప్స్ హైలైట్‌గా నిలిచాయి. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇద్దరు లెజెండరీ నటులతో కలిసి స్టెప్పులేయడం ఓ మధురానుభూతి అంటూ రామ్‌చరణ్ ఈ పాట గురించి ట్విట్టర్లో ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

