Kisi ka bhai kisi ki jaan Movie Trailer | దశాబ్ధాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీని రారాజులా ఏలుతున్న సల్మాన్‌ను గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. నిజానికి గతేడాది సల్మాన్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ ముందటి ఏడాది రెండు సినిమాలు విడుదల కాగా.. రెండూ నిర్మాతలకు తేరుకోని నష్టాల్ని మిగిల్చాయి. దాంతో సల్మాన్ కొంచెం గ్యాప్ తీసుకుని రెండు సినిమాలతో అభిమానులలో ఉత్సాహం నింపడానికి రెడీ అయ్యాడు. సల్మాన్ ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్‌మీద ఉంచాడు. అందులో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ ఒకటి. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 4న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ డేట్‌ను ప్రకటించారు.
ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వెంకటేశ్ కీలకపాత్ర పోషించనుండటంతో ఈ సినిమాపై ఇక్కడ కూడా మంచి హైపే ఉంది. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. టాలీవుడ్ అగ్ర నటుడు వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వీరమ్‌కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. తెలుగులో వీరుడొక్కడే పేరుతో డబ్బింగ్ అయింది. సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవి ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తు్న్నాడు.
#KisiKaBhaiKisiKiJaan Trailer out on April 10th.@hegdepooja @VenkyMama @farhad_samji @IamJagguBhai @bhumikachawlat @boxervijender #AbhimanyuSingh @TheRaghav_Juyal @jassiegill @siddnigam_off @ishehnaaz_gill @palaktiwarii @vinalibhatnaga1 pic.twitter.com/c404e64w9Y
— Salman Khan (@BeingSalmanKhan) April 8, 2023