Salamn Khan | షూటింగ్ పూర్తి చేసుకున్న సల్మాన్ ఖాన్-వెంకటేష్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
మూడు దశాబ్ధాలుగా పైగా బాలీవుడ్‌ను రారాజులా ఏలుతున్న సల్మాన్‌ను గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతంసల్మాన్ రెండు సినిమాలు సెట్స్‌మీద ఉంచాడు. అందులో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ ఒకటి.
Kisi ka Bhai Kisi Ki Jaan Movie | మూడు దశాబ్ధాలుగా పైగా బాలీవుడ్‌ను రారాజులా ఏలుతున్న సల్మాన్‌ను గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. నిజానికి గతేడాది సల్మాన్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ ముందటి ఏడాది రెండు సినిమాలు విడుదల కాగా.. రెండూ నిర్మాతలకు తేరుకోని నష్టాల్ని మిగిల్చాయి. దాంతో సల్మాన్ కొంచెం గ్యాప్ తీసుకుని రెండు సినిమాలతో అభిమానులలో ఉత్సాహం నింపడానికి రెడీ అయ్యాడు. సల్మాన్ ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్‌మీద ఉంచాడు. అందులో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ ఒకటి. ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటష్ కీలకాపాత్ర పోషిస్తున్నాడు. ఇక ఇప్పటికే మేకర్స్ రిలీజ్చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ భారీ హైప్‌ను తెచ్చిపెట్టాయి.
కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని సల్మాన్ స్వయంగా తెలిపాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్టయిన వీరమ్‌కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. తెలుగులో వీరుడొక్కడే పేరుతో డబ్బింగ్ అయింది. సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించాడు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది.
#KisiKaBhaiKisikiJaan shooting complete … #eid2023 pic.twitter.com/9K14xxumW8
— Salman Khan (@BeingSalmanKhan) February 8, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

