కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సమ్మతమే’. గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రవీణ్ కంకణాల నిర్మించారు. జూన్ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం టీజర్‌ను విడుదల చేశారు. పెళ్లికి ముందు ప్రేమంటే గిట్టని కథానాయకుడు చివరకు ప్రేమలో పడటం..ఈ క్రమంలో పండే వినోదంతో టీజర్ ఆకట్టుకుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా పాటలకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఆహ్లాదభరిత ప్రేమకథతో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది’ అన్నారు. ‘కెరీర్ తొలినాళ్లలో దర్శకుడు, నేనూ కలిసి షార్ట్‌ఫిల్మ్స్ తీశాం. ఈ సినిమా కోసం మరింత బాధ్యతతో పనిచేశాం. శేఖర్‌చంద్ర చక్కటి బాణీలిచ్చారు. ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా అలరిస్తుంది’ అని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. ఈ సినిమాకు ప్రేక్షకులందరూ తమ సమ్మతిని తెలియజేస్తారనే నమ్మకం ఉందని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌రెడ్డి మాసం, సంగీతం: శేఖర్‌చంద్ర, ఆర్ట్: సుధీర్ మాచర్ల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి.