కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సమ్మతమే’. గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ్ నిర్మిస్తున్నారు. జూన్ 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇటీవల కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
‘ఆహ్లాదభరితంగా సాగే ప్రేమకథా చిత్రమిది. ఓ జంట ప్రయాణంలోని మధురానుభూతులకు దర్పణంలా ఉంటుంది. ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు..ఫస్ట్ గ్లింప్స్ అందరిని అలరిస్తున్నాయి’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌రెడ్డి మాసం, సంగీతం: శేఖర్‌చంద్ర, ఆర్ట్: సుధీర్ మాచర్ల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి.