Meter Movie Trailer | యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో మళ్లీ తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న కిరణ్‌కు ఈ సినిమా కాస్త ఊరటనిచ్చింది. ఇక ఇప్పుడు అదే జోష్‌తో ‘మీటర్’తో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. కాకపోతే ఈ సారి కాస్త యాక్షన్ డోస్ పెంచాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, పోస్టర్లు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. రమేష్ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై క్రేజ్ తీసుకొస్తున్నారు. కాగా తాజాగా మేకర్స్ మీటర్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ మాస్ ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్‌లా కనిపిస్తుంది. ట్రైలర్లో పెద్దగా ఏమి రివీల్ చేయలేదు గానీ, కిరణ్ పోలీస్ ఆఫీసర్‌గా ఏదో అలా లైఫ్‌ను టైమ్‌పాస్ చేస్తున్న సమయంలో ఒక విషయంలో ఓ రాజకీయ నాయకుడితో గొడవ ఏర్పడుతుంది. ఆ గొడవతో తనలో మార్పు వచ్చి.. డ్యూటీని సీరియస్‌గా తీసుకుని ఆ రాజకీయ నాయకుడికి ఎలా అడ్డుగా ఉన్నాడో అనే నేపథ్యంలో సినిమా కథ సాగనున్నట్లు ట్రైలర్‌తో స్పష్టం అవుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అదిరిపోయాయి. నటుడిగా కిరణ్ తనలోని పూర్తి మాస్‌ను ఈ సినిమాతో బయటకు తీసినట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలన్ని ఒక్క ట్రైలర్‌తో డబుల్ అయ్యాయి.
ఎయ్యడం నాకు కొత్తేమి కాదు.. నీ ముందు ఎయ్యడం కొత్త, వాడు బాల్ లాంటొడు ఎన్ని సార్లు కొట్టిన పైకి లేస్తూనే ఉంటాడు. ఏ తండ్రైనా తను ఓడిపోతే బాధపడడు గానీ, తన కొడుకు ఓడిపోతే మాత్రం బాధ పడుతాడు. భగవంతుడి ముందు భక్తితోనూ.. బలవంతుడి ముందు భయంతోనూ ఉండాలి అనే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక అతుల్య రవి, కిరణ్ అబ్బవరం కెమెస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సాయికార్తిక్ నేపథ్య సంగీతం వీర లెవల్లో ఉంది. చూస్తుంటే ఈ సారి కిరణ్ భారీ కమర్షియల్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు.
క్లాప్ ఎంటర్టైనమెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ సంస్థ రిలీజ్ చేస్తుంది. ఇక అదే రోజున రవితేజ రావణాసుర విడుదల కాబోతుంది. ఈ సినిమాపై ఎక్కడలేని క్రేజ్ ఉంది. ఈ సినిమాతో పోటీ పడి నెగ్గాలంటే మీటర్లో జనాలను ఎంటర్టైన్ చేసే మ్యాటర్ ఉండాల్సిందే. మరీ రవితేజతో పోటీని తట్టుకుని కిరణ్ నిలుస్తాడా లేదా అనేది చూడాలి.