Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం మీటర్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్
తొలి సినిమా 'రాజావారు రాణిగారు'తో అటు ఇటుగా మార్కులు వేయించుకున్న కిరణ్.. 'ఎస్.ఆర్ కళ్యాణమండపం'తో వంద మార్కులు కొట్టేశాడు. రెండో సినిమాకే బ్లాక్‌బస్టర్ విజయం సాధించి యూత్‌లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు.
Meter Movie | తొలి సినిమా ‘రాజావారు రాణిగారు’తో అటు ఇటుగా మార్కులు వేయించుకున్న కిరణ్.. ‘ఎస్.ఆర్ కళ్యాణమండపం’తో వంద మార్కులు కొట్టేశాడు. రెండో సినిమాకే బ్లాక్‌బస్టర్ విజయం సాధించి యూత్‌లో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మాత్రం వరుసగా మూడు ఫ్లాపులు. మధ్యలో ‘సమ్మతమే’ కాస్త బెటర్ అనిపించినా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేదు. ఇక కిరణ పని అయిపోయంది అనుకున్న టైమ్‌లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు.
రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. పైగా గీతా సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనే అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. కలక్షన్లలో మాత్రం జోరు చూపించింది. ఇటీవలే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం లాభాల బాట పట్టింది. ఇక కిరణ్ ఇదే స్పీడ్‌తో తన నెక్స్ట్ సినిమాకు సిద్ధమవుతున్నాడు. మీటర్ అంటూ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతున్నాడు. రమేష్ కాదురి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.
ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై కాస్త మంచి బజ్నే తెచ్చిపెట్టాయి. దానితో పాటుగా మైత్రీ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఎక్కువ క్యూరియాసిటే ఉంది. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను ప్రకటించారు. ఈ సినిమా టీజర్‌ను మార్చి 7న సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. క్లాప్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో కిరణ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. తమిళ నటి అతుల్యరవి హీరోయిన్గా నటించింది.
Get ready for 𝗙𝗨𝗟𝗟 𝗧𝗛𝗥𝗢𝗧𝗧𝗟𝗘 𝗔𝗖𝗧𝗜𝗢𝗡 & 𝗘𝗡𝗧𝗘𝗥𝗧𝗔𝗜𝗡𝗠𝗘𝗡𝗧 🔥🔥#MeterTeaser on 7th March at 4:05 PM 💥💥#Meter@Kiran_Abbavaram #RameshKaduri @AthulyaOfficial #SaiKartheek #VenkatCDileep #SarangamSuresh @ClapEntrtmnt @SonyMusicSouth pic.twitter.com/YmN3X0l01f
— Mythri Movie Makers (@MythriOfficial) March 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

