Meter Movie On Ott | వినరో భాగ్యము విష్ణు కథా సినిమాతో కిరణ్ అబ్బవరం మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చాడనుకుంటే మీటర్‌తో మరో ఫ్లాప్‌ను మూటుగట్టుకున్నాడు. రమేష్ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇదే నెల తొలివారంలో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు చేసిన హడావిడితో సినిమాపై ప్రేక్షకుల్లో కాస్త మంచి హైపే క్రియేట్ అయ్యింది. తీరా రిలీజయ్యాక ఈ సినిమాకు అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. దానికి తోడు దసరా హవా అప్పటికీ కొనసాగుతుండటంతో ఈ సినిమాను పట్టించుకున్న వారు కరువయ్యారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా మే 5నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. సినిమా విడుదలైన నాలుగు వార్లాలోనే మీటర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను క్లాప్ ఎంటర్టైనమెంట్స్ సంస్థ నిర్మించింది. కిరణ్‌కు జోడీగా తమిళ హీరోయిన్ అతుల్య రవి నటించింది. సాయి కార్తిక్ స్వరాలు సమకూర్చాడు.