Kiran Abbavaram | బిగ్‌బాస్ ఫేమ్ రతిక లాంటి అమ్మాయితో నీకు పెళ్ళవ్వాలి.. నెటిజన్ ప్రశ్నకు నాపై ఎందుకంత పగ అంటూ కిరణ అబ్బవరం రిప్లై..!
Kiran Abbavaram - Rathika | ముందు చెప్పినట్లుగానే బిగ్ బాస్ ఏడో సీజన్ (Bigg Boss 7) ఉల్టా పల్టాలా సాగుతుంది. ఇప్పటికే 4 వారాలు పూర్తయిపోయాయి. అయితే మూడు వారాల నామినేషన్ల కంటే నాలుగో వారం నామినేషన్ కోసం బిగ్ బాస్ లవర్స్ తెగ వేయిట్ చేశారు. అందుకు ముఖ్యం కారణం రతిక (Rathika).
Kiran Abbavaram – Rathika | ముందు చెప్పినట్లుగానే బిగ్ బాస్ ఏడో సీజన్ (Bigg Boss 7) ఉల్టా పల్టాలా సాగుతుంది. ఇప్పటికే 4 వారాలు పూర్తయిపోయాయి. అయితే మూడు వారాల నామినేషన్ల కంటే నాలుగో వారం నామినేషన్ కోసం బిగ్ బాస్ లవర్స్ తెగ వేయిట్ చేశారు. అందుకు ముఖ్యం కారణం రతిక (Rathika). టైటిల్ హాట్ ఫేవరైట్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రతిక నాలుగోవారం ఎలిమినేట్ అయింది. పల్లవి ప్రశాంత్‌కు వెన్నుపోటు పొడవడం, యావర్‌ను కంటెండర్‌గా, హౌజ్‌మేట్‌గా చూడాలని అతనికి చెప్పి.. కన్ఫెషన్ రూమ్‌లో మాత్రం వ్యతిరేకంగా మాట్లాడటం, హౌజ్‌లో లవ్ ట్రాక్స్ నడపడం.. ఇలా అవసరానికి మాత్రమే వాడుకునే లక్షణాలు ఉండటం వంటి పలుకారణాలతో రతిక ఎలిమినేట్ అయింది. ఇదిలా ఉంటే.. రతికపై టాలీవుడ్ కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) పెట్టిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తాజాగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్ (Rules Ranjan). రుథిరమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha Shetty) ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 06న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్లు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి కిరణ్ అబ్బవరం ట్విట్టర్లో ఆన్లైన్ చాట్ సెషన్ నిర్వహించాడు. అయితే ఈ చాట్ సెషన్లో ఓ నెటిజన్ స్పందిస్తూ.. రూల్స్ రంజన్ హిట్ అయ్యాకా బిగ్ బాస్ ఫేమ్ రతిక లాంటి అమ్మాయితో నీకు పెళ్ళవ్వాలి కోరుకుంటున్నా అంటూ కామెంట్ చేశాడు. దీనిపై కిరణ్ అబ్బవరం రిప్లయ్ ఇస్తూ.. ”బాబు గుడుంబా ఎందుకమ్మా నా మీద నీకు అంత పగ. పెళ్లి అయితే చేసుకుందాం కానీ.. రాని ఎలాంటి అమ్మాయి వస్తుందో చూద్దాం” అంటూ రిప్లయ్ ఇచ్చాడు. ఇక కిరణ్ పెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#AskKiranAbbavaram #RulesRanjann https://t.co/Pvxflik5oe pic.twitter.com/edZXIvyeoV
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 3, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

