ఇక విజయమే మిగిలింది
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా ‘మీటర్'. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. రమేష్ కాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతున్నది.
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా ‘మీటర్’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. రమేష్ కాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతున్నది. బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు రమేష్ కాదూరి మాట్లాడుతూ…‘టీజర్, పాటలు, ట్రైలర్ సక్సెస్ అయ్యాయి. ఇక సినిమానే మిగిలింది. మూవీ మిమ్మల్ని తప్పకుండా థియేటర్లో అలరిస్తుంది’ అన్నారు.
నిర్మాత చెర్రీ మాట్లాడుతూ…‘దర్శకుడు కథ చెప్పగానే మాస్ కమర్షియల్ చిత్రం అవుతుందని నమ్మకం కలిగింది. రేపు థియేటర్లో సినిమా చూస్తే కొత్త దర్శకుడు రూపొందించాడని అనిపించదు. కిరణ్ తొలిసారి మాస్ క్యారెక్టర్లో ఆకట్టుకుంటారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చిత్రమవుతుంది’ అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ…‘75 రోజులు రాత్రీ పగలు కష్టపడి ఈ సినిమా చేశాం.
నేను పరిశ్రమకు వచ్చి ఐదేండ్లవుతున్నది. కానీ ఇలాంటి మాస్ సినిమాలో నటించే అవకాశం రాలేదు. ఈ సినిమా మీరు ఊహించినదాని కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ వినోదాన్ని అందిస్తుంది. టీజర్, ట్రైలర్ లాగే సినిమా కూడా పరుగులు పెడుతుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక అతుల్య రవి, సంగీత దర్శకుడు సాయి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

