Kiran Abbavaram | ‘సెబాస్టియన్ పీసీ 524’ నా సోదరుడికి అంకితం: కిరణ్ అబ్బవరం
కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం సెబాస్టియన్ పీసీ 524 (Sebastian PC 524). కిరణ్ అబ్బవరం రేచీకటి ఉన్న కానిస్టేబుల్‌గా నటిస్తున్నాడు. కామెడీ, సీరియస్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.
ఎస్ఆర్ కల్యాణ మండపం హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తోన్న తాజా చిత్రం సెబాస్టియన్ పీసీ 524 (Sebastian PC 524). కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం రేచీకటి ఉన్న కానిస్టేబుల్‌గా నటిస్తున్నాడు. కామెడీ, సీరియస్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. మార్చి 4న విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం ప్రీ రిలీజ్‌ఈవెంట్‌ను నిర్వహించారు.
‘మమ్మల్ని ఆశీర్వదించేందుకు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. కెమెరా ముందు నటించే ఛాన్స్ ను ఓ వరంలా భావిస్తున్నా. మా సినిమాకు డబ్బు ఖర్చు పెట్టడం వల్ల ప్రేక్షకులను అతిథులుగా చూడాల్సి వస్తుంది. యూనిట్ మెంబర్స్ నిద్రలేకుండా ఈ చిత్రానికి పనిచేశారు. ఈ సినిమాతో ప్రేక్షకుల ఆదరణ పొందుతాననే నమ్మకం ఉంది. ఈ సినిమాకు తల్లీ కొడుకుల సెంటిమెంట్ చాలా ప్రత్యేకమైంది.
హీరోకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావడానికి అతని తల్లి, తండ్రి ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. అయితే ప్రజలు అతనిపై జాలి చూపకుండా ఉండటానికి రేచీకటి ఉందని చెప్పొద్దని హీరోకు తల్లి సూచిస్తుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేదే స్టోరీ’ అని అన్నాడు కిరణ్.
‘నేను నటుడిని అయ్యేందుకు నా సోదరుడు చాలా త్యాగాలు చేశాడు. నన్నెప్పుడూ ఉన్నత స్థానంలో చూడాలనుకున్నాడు. ఆయన నాపై ఎలాంటి ప్రేమ కురిపించాడో..చాలా చాలా కష్టపడి అంతకన్న ఎక్కువ ప్రేమ ఆయనకు తిరిగిస్తా. నా సోదరుడు లేకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. కంటెంట్ బాగుందని నమ్మితేనే ప్రేక్షకులు నా సినిమా చూడాలని కోరుకుంటున్నా. ఈ సినిమాను సోదరుడికి అంకితమిస్తున్నానని’ ఎమోషనల్ అయ్యాడు కిరణ్ అబ్బవరం.
ఈవెంట్‌కు డైరెక్టర్లు వెంకీ కుడుముల (Venky Kudumula), వేణు శ్రీరామ్, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, చెర్రీ, నటులు సాయికుమార్, అడివి శేష్, ఆకాశ్ పూరి, సప్తగిరి, నిర్మాత కోడి దివ్య, లిరిక్ రైటర్ భాస్కర భట్ల హాజరయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

