కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏ.ఎం.రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. రత్నం కృష్ణ దర్శకుడు. ఇటీవల ఈ చిత్రంలోని ‘నాలో నేను లేను’ అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘తన ప్రేమను కథానాయికకి చెప్పడం కోసం హీరో పడే తపన ఈ పాటలో వుంటుంది. వినోదమే ప్రధానంగా సినిమాను రూపొందిస్తున్నాం.’ అన్నారు.