‘కింగ్డమ్’ కాస్త ఆలస్యం
అగ్ర హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘కింగ్డమ్' విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను జూలై 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ముందస్తు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30న సినిమా విడుదల కావాల్సి ఉంది.
- జూలై 4న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటన
అగ్ర హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘కింగ్డమ్’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను జూలై 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ముందస్తు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30న సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇటీవల దేశంలో చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం కష్టమని భావించి ముందుగా అనుకున్న రోజున రిలీజ్ చేయలేకపోతున్నామని చిత్ర బృందం పేర్కొంది.
‘వాయిదా నిర్ణయం సినిమాకు మరిన్ని మెరుగులుదిద్ది, మరింత ఉన్నతీకరించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. కాస్త ఆలస్యమైనా సరే అభిమానుల అంచనాల్ని అందుకొని ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’ అని మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. పీరియాడిక్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.
‘వలసపోయినా..అలసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం, ఈ అలజడి ఎవరి కోసం? ఇంత భీభత్సం ఎవరి కోసం?…రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం, కాలచక్రాన్ని బద్దలుకొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం’ అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ అభిమానుల అంచనాల్ని రెట్టింపు చేసింది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, రచన-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

