King 100 | కింగ్ 100 గ్లింప్స్ విడుదల.. పవర్ ఫుల్ డైలాగ్‌తో హీరో పరిచయం
King 100 | అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగార్జున కెరీర్‌లోని ప్రతిష్టాత్మక 100వ సినిమా సందడి మొదలైంది. ‘కింగ్ 100’గా ప్రచారంలో ఉన్న ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌ని గ్లింప్స్ ద్వారా రివీల్ చేశారు. సినిమా టైటిల్‌ని ‘కింగ్ 100’ అని పెట్టడం గమనార్హం.
King 100 | అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగార్జున కెరీర్‌లోని ప్రతిష్టాత్మక 100వ సినిమా సందడి మొదలైంది. ‘కింగ్ 100’గా ప్రచారంలో ఉన్న ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌ని గ్లింప్స్ ద్వారా రివీల్ చేశారు. సినిమా టైటిల్‌ని ‘కింగ్ 100’ అని పెట్టడం గమనార్హం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని ఫ్యామిలీ నిర్మాణంలో తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు నాగార్జున పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. మనుషుల్లో రెండు రకాలు.. ఒకటి డబ్బున్న వాళ్లు, మరొకటి డబ్బు లేని వాళ్లు అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో నాగార్జునని పరిచయం చేశారు.
గ్లింప్స్ చూస్తుంటే డబ్బు లేని ఓ పేదవాడు కసిగా ఎదిగి, మోసాలు చేస్తూ బాగా సంపాదించి కింగ్ స్థాయికి ఎలా ఎదిగాడు అనేది చిత్రంలో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించనున్నట్టు అర్ధమవుతుంది. మరోవైపు చిత్రంలో ఫాదర్ ఎమోషన్ కూడా ఉండబోతుంది అని, నాగార్జున ఇందులో ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ వర్షన్ లో కూడా కనిపించబోతున్నట్టు అర్ధమవుతుంది. చిన్న గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని రేపుతోంది. కేవలం కొద్ది సెకన్ల వీడియోతోనే చిత్రంపై భారీ హైప్‌ను క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న అంశం టబు ఎంట్రీ. గతంలో నాగార్జున, టబు కలిసి నటించిన ‘నిన్నే పెళ్లాడుతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
చాలా ఏళ్ల తర్వాత ఈ హిట్ జోడీ మళ్లీ ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో టబు పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, కథను మలుపు తిప్పే పవర్ఫుల్ క్యారెక్టర్లో ఆమె కనిపించనున్నారని సమాచారం. దీంతో నాగ్-టబు కాంబినేషన్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ‘నితమ్ ఒరు వానమ్’ చిత్రంతో దర్శకుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న రా కార్తీక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భావోద్వేగాలకు, కమర్షియల్ ఎలిమెంట్స్‌కు సమాన ప్రాధాన్యం ఇస్తూ నాగార్జున 100వ సినిమాను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్‌ను బట్టి చూస్తే, దర్శకుడు ఈసారి ఫీల్‌గుడ్ కథకు భిన్నంగా మిస్టరీ, యాక్షన్ అంశాలతో కూడిన కథను ఎంచుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్టు గ్లింప్స్ తో తెలియజేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

