ప్రత్యేక శక్తులున్న స్త్రీ కథ
జ్యోతి పూర్వాజ్, పూర్వాజ్ లీడ్‌రోల్స్ చేసిన థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్'. పూర్వాజ్ స్వీయ దర్శకత్వంలో ఎ.పద్మనాభరెడ్డితో కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.
జ్యోతి పూర్వాజ్, పూర్వాజ్ లీడ్‌రోల్స్ చేసిన థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’. పూర్వాజ్ స్వీయ దర్శకత్వంలో ఎ.పద్మనాభరెడ్డితో కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు హరీష్‌శంకర్ ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘జ్యోతి పూర్వాజ్ ఇందులో విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. ప్రత్యేక శక్తులున్న మహిళగా ఇందులో ఆమె పాత్ర సాగుతుంది. ఆమె ఎవరు? అంటూ సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉంటుంది.
2024, 25, 26.. ఈ మూడేళ్ల నేపథ్యంతో మూడు డిఫరెంట్ లేయర్లతో కథ సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు హైలైట్. ఇలాంటి సినిమా ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై రాలేదు’ అని దర్శకనిర్మాత, నటుడు పూర్వాజ్ తెలిపారు. ఇలాంటి వినూత్నమైన సినిమాను తీసిన పూర్వాజ్‌ను చూస్తుంటే గర్వంగా ఉందని జ్యోతిపూర్వాజ్ అన్నారు. ఇంకా మరో నిర్మాత పద్మనాభరెడ్డి, నటుడు గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, డీవోపీ జగదీశ్ బొమ్మిశెట్టి, ఎడిటర్ బి.మనోజ్‌కుమార్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

