శనివారం కన్నడ అగ్ర నటుడు సుదీప్ జన్మదినం సందర్భంగా ఆయన నటించబోతున్న పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించారు. ఆర్సీ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించనుంది. ఆర్.చంద్రూ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.