Kichcha Sudeep | పదేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టనున్న కిచ్చా సుదీప్..!
Kichcha Sudeep | పుష్కర కాలం కిందట వచ్చిన రక్త చరిత్ర సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కిచ్చా సుదీప్. ఆ తర్వాత ఈగతో దగ్గరయ్యాడు. ఇక బాహుబలి, సైరా వంటి సినిమాల్లో నటించి ఇక్కడ కూడా మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు.
Kichcha Sudeep | పుష్కర కాలం కిందట వచ్చిన రక్త చరిత్ర సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కిచ్చా సుదీప్. ఆ తర్వాత ఈగతో దగ్గరయ్యాడు. ఇక బాహుబలి, సైరా వంటి సినిమాల్లో నటించి ఇక్కడ కూడా మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఆ మధ్యన రిలీజైన విక్రాంత్ రోణ ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్టయింది. ఇక ఇదిలా ఉంటే కిచ్చా సుదీప్ పదేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు ఓ స్పెషల్ వీడియోతో చిత్రబృందం వెల్లడించింది.
ఉరుముతున్న మేఘాలను చూపిస్తూ దేవుడు క్షమిస్తాడు, నేను క్షమించను అంటూ అనౌన్స్మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉంది. కేఆర్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరో కూడా సుదీప్ కిచ్చానే. చివరగా సుదీప్ మాణక్య అనే యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అప్పట్లో బంపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఇప్పటివరకు సుదీప్ ఆరు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ ఆరు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్లుగానే నిలిచాయి.
ప్రస్తుతం కిచ్చా సుదీప్ మాక్స్ సినిమాతో పాటు కబ్జా-2 చేస్తున్నాడు. శనివారం సుదీప్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన మాక్స్ టీజర్ వీర లెవల్లో ఉంది. కన్నడతో పాటు తమిళంలోనూ ఈ సినిమా రూపొందుతుంది. తొలి పార్టులో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సుదీప్.. సెకండ్ పార్ట్‌లో మేయిన్ రోల్లో నటించనున్నాడట.
Happy birthday sir ❤️❤️@KicchaSudeep
ನಿಮ್ಮ ಯಶಸ್ಸಿನ ಪ್ರಯಾಣ ಹೀಗೆ ನಮಗೆ ಸ್ಫೂರ್ತಿಯಾಗಲಿ! pic.twitter.com/FEE6DqzJId— Sathish Ninasam (@SathishNinasam) September 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

