Kichcha sudeep | మీడియా ప్రతినిధులకు హీరో సుదీప్ క్షమాపణలు
Kichcha sudeep Apologies Media | కన్నడ హీరో సుదీప్ కిచ్చా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్తచరిత్ర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుదీప్ ‘ఈగ’ సినిమాతో తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత వరుసగా ‘బాహుబలి’, ‘సైరా’ వంటి పాన్ ఇండియా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో ‘విక్రాంత్ రోనా’ ఒకటి. అనూప్ భందారి దర్శకత్వం వహించాడు. గతేడాది జూలైలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల తేది పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఇటీవలే మేకర్స్ జూలై 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు.
ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ చేసింది. ప్రమోషన్లో భాగంగా సుదీప్ గురువారం రోజు హైదరాబాద్, చెన్నై, కొచ్చిలలో ప్రెస్‌మీట్ నిర్వహించాల్సి ఉంది. కాగా మూవీ యూనిట్ ప్రెస్మీట్లను క్యాన్సిల్ చేసింది. దీంతో సుదీప్, మీడియా ప్రతినిధులకు క్షమాపణలు తెలుపుతూ.. ‘అనారోగ్యం వల్ల రాలేకపోతున్నానని, త్వరలోనే డేట్‌ను రీ షెడ్యూల్ చేసి మిమ్మల్ని కలుస్తానని’ ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఈ చిత్రంపై ప్రేక్షకులలో మొదటి నుండి మంచి బజ్ ఉంది. ఇక ఇటీవలే విడులైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.
ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్, ఇన్వేనియో ఫిలింస్ ఇండియా సంస్థలతో కలిసి సుదీప్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. నిరూప్ భందారి, బాలీవుడ్ భామ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Apologies to all my media frnzz frm Chennai,Kochi & Hydarabad, for having canceled the press meet & event. I have Been Unwell. Feeling much better & shall resume travel again. IHoping to Reschedule to a sooner date.
Looking forward to meeting u all.
🥂
Love & Regards,
Kichcha❤️— Kichcha Sudeepa (@KicchaSudeep) July 21, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

