మధుబాలగా నటించాలి!

అలనాటి అగ్రనాయిక మధుబాల జీవితకథలో నటించాలన్నది తన చిరకాల స్వప్నమని చెప్పింది కియారా అద్వాణీ. కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో తనకు ప్రవేశముందని, ఈ ఆటలకు సంబంధించి తనలో ఉన్న నైపుణ్యాల్ని వెండితెరపై ప్రదర్శించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. కథానాయికగా అరంగేట్రం చేసి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల అభిమానులతో ముచ్చటించింది కియారా అద్వాణీ. ఈ వేడుకలో సినిమాల విషయంలో తన కలల్ని గురించి కియారా అద్వాణీ వెల్లడిస్తూ ‘కమర్షియల్ సినిమాలతో పోలిస్తే బయోపిక్‌లు నటీనటులకు చాలెంజింగ్‌గా నిలుస్తుంటాయి. జీవితకథల్లో నటించడం నాకు ఇష్టమే. ఎవరి పాత్రను చేస్తున్నామో వారి జీవితంలోని సంఘర్షణను, సారాన్ని అర్థంచేసుకుంటూ నటిస్తేనే బయోపిక్‌లకు న్యాయం చేయగలం. కేవలం వారి హావభావాల్ని అనుకరిస్తే సరిపోదు. మధుబాల జీవితకథలో నటించాలన్నది నా కల. ఎప్పటికైనా ఆ కోరిక తీరుతుందనే నమ్మకముంది’ అని తెలిపింది. అలాగే ‘స్కూల్‌డేస్‌లో స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, త్రోబాల్ టీమ్‌లలో నేను ప్లేయర్‌గా ఉండేదాన్ని. మార్షల్ ఆర్ట్స్‌లో నాకు ప్రవేశముంది. నాలోని ప్రతిభను చాటుకునేలా పూర్తిస్థాయి క్రీడానేపథ్య, యాక్షన్ సినిమా చేయాలనుంది’ అని కియారా చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- biopic
- kiara advani
- Madhubala
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

