సాధారణంగా బాలీవుడ్లో ఎక్కువగా వినిపించే పేర్లు అలియాభట్, దీపికా పదుకొనే, కత్రినాకైఫ్. అందం, అభినయం మెండుగా వున్నా.. విజయాలు కూడా బాగానే పలకరించినా ఎందుకోగానీ కియరా అద్వానీ పేరు మాత్రం పెద్దగా వినిపించదు. కానీ.. ప్రస్తుతం ఓ విషయంలో తోటి కథానాయికలందర్నీ వెనక్కి నెట్టి నంబర్‌వన్ స్థానంలో కూర్చుంది కియారా.
ఎలాగంటారా? ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువమంది వెతికిన వ్యక్తుల జాబితాలో కియరా నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో ఈ ఏడాది ఆమె వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సినిమాలు, ఫోటోషూట్స్ అంటూ బిజీబిజీగానే గడిపుతున్నది కియరా. ఇప్పుడు గూగుల్ సెర్చ్‌లో టాప్ ప్లేస్‌లో ఉండటంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యింది.