Khaidi Movie | ‘ఖైదీ’కి 40 ఏళ్ళు.. ఈ సినిమా నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసిందంటూ మెగాస్టార్ ఎమోషనల్
Khaidi Movie | మెగాస్టార్ చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఖైదీ’. 1983 అక్టోబర్ 28న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రూ.8 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
Khaidi Movie | మెగాస్టార్ చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఖైదీ’. 1983 అక్టోబర్ 28న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రూ.8 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో చిరంజీవి నటన అప్పట్లో ఓ సంచలనం. ఇక ఈ సినిమాతోనే చిరంజీవి స్టార్ హీరో అయ్యి టాలీవుడ్‌ని ఏలాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను గుర్తు చేసుకుంటూ.. ట్విట్టర్లో ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాడు.
‘ఖైదీ సినిమా నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. ”ఈ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ , ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్‌ని, రచయితలు పరుచూరి సోదరులను, నాకో- స్టార్స్ సుమలత, మాధవిలని మొత్తం టీమ్‌ని అభినందిస్తూ, అంత గొప్ప విజయాన్ని మాకందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు అంటూ” చిరు ట్విట్టర్లో రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
‘ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది.
నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది.
ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి
ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ,
ఆ చిత్ర… pic.twitter.com/raY4AOTAoH— Chiranjeevi Konidela (@KChiruTweets) October 28, 2023
మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుగు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇటీవలే ఈ విషయంపై చిరు, త్రివిక్రమ్ కలిశారట. ‘ఖైదీ’ సీక్వెల్ బాధ్యతను త్రివిక్రమ్‌కు అప్పజెప్పారట మెగాస్టార్. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేశ్‌తో ‘గుంటూరుకారం’ చేస్తున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా ఉంటుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఈ సినిమా ఉండొచ్చని టాక్. చిరంజీవి కూడా తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ ‘ఖైదీ’ సీక్వెల్ విషయంలో నిజం ఎంతుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

