Krishna G.Rao | కేజీఎఫ్ నటుడు కన్నుమూత.. దిగ్భ్రాంతిలో కన్నడ పరిశ్రమ..!
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ సీనియర్ నటుడు కృష్ణ జి రావు (71) కన్నుమూశాడు. కేజీఎఫ్ సినిమాతో ఆయనకు మంచి పాపులారిటీ వచ్చింది. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మృతి చెందారు.
Krishna G.Rao Passes Away | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ సీనియర్ నటుడు కృష్ణ జి రావు (71) కన్నుమూశాడు. కేజీఎఫ్ సినిమాతో ఆయనకు మంచి పాపులారిటీ వచ్చింది. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మృతి చెందారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ జి రావు బుధవారం బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన మృతి పట్ల కన్నడ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.
కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్‌లో కృష్ణ జి.రావు కనిపిస్తాడు. ఈ చిత్రంలో అంధుడు పాత్రలో నటించాడు. అంధుడు అయిన కృష్ణను విలన్స్ చంపడానికి ప్రయత్నిస్తుండగా.. ఆయనను కాపాడడానికి రాఖీ భాయ్ రంగంలోకి దిగుతాడు. ఈయన నిడివి తక్కువే అయినప్పటికీ.. హీరోకి ఎక్కువ ఎలివేషన్స్ రావడానికి కారణమైన పాత్రలో కనిపించడంతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. కేజీఎఫ్ సెకండ్ పార్ట్‌లో కూడా ఈయన సుల్తాన్ పాటలో కనిపిస్తాడు. ఈ సినిమా తర్వాత ఈయనకు కన్నడలో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆయన మేయిన్ లీడ్ లోనూ నానో నారాయణప్ప అనే సినిమా చేశాడు. ప్రస్తుత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరపుకుంటున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.
కేవలం నటుడిగానే కాకుండా కృష్ణ అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా దాదాపు 40సినిమాలకు పైగా పనిచేశాడు. అనేక సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటించాడు. అంతేకాకుండా దాదాపు 500 సినిమాలకు సెన్సార్ స్క్రిప్ట్ రాశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kgf Movie
- Krishna.G.Rao
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

