Vinodaya sitham | వినోదయ సితం రీమేక్‌లో కేతిక శర్మ?
రెండేళ్ల క్రీతం ఓటీటీలో విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకున్న సినిమా 'వినోదయ సితం'. సముద్రఖని, తంబిరామయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో రూపొందించాడు.
Kethika Sharma | రెండేళ్ల క్రీతం ఓటీటీలో విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకున్న సినిమా ‘వినోదయ సితం’. సముద్రఖని, తంబిరామయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో రూపొందించాడు. ఇక ఇప్పుడు ఇదే సినిమాను పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖని రీమేక్ వెర్షన్‌ను కూడా రూపొందిస్తున్నాడు. తెలుగు నెటీవిటీకి తగ్గట్లు త్రివిక్రమ్ పలు మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు.
ఈ సినిమాలో పవన్‌తో పాటు సాయి ధరమ్‌తేజ్ కూడా నటించబోతున్నాడు. తంబి రామయ్య పోషించిన పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించనున్నాడు. అయితే ఇందులో సాయి తేజ్ పాత్రను యువకుడిగా మార్చారు. ఇక ఈ సినిమాలో సాయిధరమ్‌కు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉండనుందట. కాగా ఆ పాత్రను కేతిక శర్మ పోషించనుందని తెలుస్తుంది. కాగా ఆమె వైష్ణవ్‌తేజ్‌తో కలిసి అంగరంగ వైభవంగా సినిమాలో ఆడిపాడిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి అన్నతో కలిసి నటించబోతుంది. ఇప్పటికే మేకర్స్ ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. సముద్రఖని చేసిన దేవుడి పాత్రను పవన్ పోషించనున్నాడు.
ఇక దీనితో పాటుగా సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కార్తిక్ దండు అనే కొత్త దర్శకుడితో ‘విరూపాక్ష’ అనే మిస్టరీ థ్రిల్లర్ చేస్తున్నాడు.శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదల కానుంది.
మరిన్ని ఫొటోల కోసం: Ketika Sharma | సరికొత్త పోజులతో హీటెక్కిస్తున్న కేతికా శర్మ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

