నన్ను భరించడం కష్టం!

‘క్రీడా నేపథ్య చిత్రాల్లో చాలా ఎమోషన్ ఉంటుంది. అవి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. ‘లక్ష్య’ చిత్రం అందరికి నచ్చుతుంది’ అని చెప్పింది కేతికా శర్మ. ‘రొమాంటిక్’ చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసిందీ భామ. ఆమె నాగశౌర్య సరసన కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. ఈ నెల 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం కేతికా శర్మ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ సినిమాలో నా పాత్ర పేరు రితిక. పక్కింటి అమ్మాయి తరహాలో ఉంటుంది. తన మనసుకు నచ్చిన పని చేస్తుంది. నిజజీవితంలో నేనూ అలాగే ఉంటాను. నా మనసుకు నచ్చిందే చేస్తాను. అందుకే నన్ను భరించడం కొంచెం కష్టమే. తొలి చిత్రం ‘రొమాంటిక్’తో పోల్చితే పూర్తి వైవిధ్యమైన పాత్ర ఇది. నాకు క్రీడలంటే చాలా ఇష్టం. నాకు రాష్ట్రస్థాయి స్విమ్మర్‌గా గుర్తింపు ఉంది. ‘లక్ష్య’ సినిమా విలువిద్య నేపథ్యంలో భావోద్వేగభరితంగా సాగుతుంది. ఈ సినిమా కోసం చాలా మంది ఆర్చర్స్‌ను కలిసి వాళ్ల అనుభవాల గురించి తెలుసుకున్నా. నాకు భాషా పరమైన ఎలాంటి హద్దులు లేవు. నా జీవితంలోని ఒకే ఒక కల..నటినవ్వాలని. అది నెరవేరింది. అభినయప్రధాన పాత్రలపై దృష్టి పెడుతూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటా’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
కాంగ్రెస్ పాలనలో కరోనా కంటే దారుణం.. రెండేళ్లలో భారీగా పడిపోయిన పెట్టుబడులు.. టీజీఐపాస్ గణాంకాల్లో నిగ్గుతేలిన నిజాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

