Keerthy Suresh | పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్.?
Keerthy Suresh | దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు అటు తమిళ మీడియాతో పాటు ఇటు తెలుగులో చక్కర్లు కొడుతున్నాయి. గీతాంజలి సినిమాతో మలయాళంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.
Keerthy Suresh Wedding | దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు అటు తమిళ మీడియాతో పాటు ఇటు తెలుగులో చక్కర్లు కొడుతున్నాయి. గీతాంజలి సినిమాతో మలయాళంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈ చిత్రం అనంతరం ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు నటించిన ఇది ఎన్న మాయం అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే ఇయర్లో నేను శైలజా అంటూ తెలుగులో వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత రజిని మురుగన్, భైరవ, మహానటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది ఈ భామ. ప్రస్తుతం బాలీవుడ్లో వరుణ్ ధావన్తో బేబి జాన్ అనే సినిమాలో నటిస్తుంది.
ఇదిలావుంటే కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్లో కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతుందని.. అదికూడా ప్రేమ పెళ్లి కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలుస్తుంది. పెళ్లి కొడుకు కూడా సురేష్ ఫ్యామిలీకి చాలా దగ్గరి బంధువని.. అందుకే కీర్తి ఒకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ రెండోవారంలో గోవాలో కీర్తి సురేశ్ పెళ్లి జరగబోతున్నట్లు టాక్. కాగా దీనిపై కీర్తి సురేష్ క్లారిటీ ఇవ్వవలసి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

