చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంతో నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకుంది. చిత్రంలో కీర్తి సురేష్ నటన అందరిని మైమరచిపోయేలా చేసింది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ పరకాయ ప్రవేశం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాని పలు అంతర్జాతీయ వేదికల్లో ఈ సినిమాను ప్రదర్శించారు.
2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి చిత్రం అనేక సాహసాల నడుమ రూపొందింది. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనే మీమాంసలో ఉండగా, మహానటి చిత్రం ప్రేక్షకుల మందుకు వచ్చి పెద్ద విజయం సాధించింది. 2016 నుండి నాగ్ అశ్విన్ ఈ సినిమా మొదలు పెట్టాడట. నేను లోకల్ సినిమా చేస్తున్న సమయంలో కీర్తి సురేష్‌ని మేకర్స్ సంప్రదించారట. సావిత్రి పాత్రకు తాను న్యాయం చేయగలుగుతానా అని కీర్తి చాలా ఖంగారు పడిందట. అయితే తనకు లుక్ టెస్ట్ చేయగా, తాజాగా నాడు కట్టుకున్న చీరను, అక్కడ లుక్ టెస్ట్ చేస్తోన్న సమయంలో దిగిన ఫోటోను కీర్తి సురేష్ షేర్ చేశారు . హహ.. లుక్ టెస్ట్ చేసిన మొదటి రోజు.. ఈ ఫోటో వెనకాల ఎన్నో మెమోరీస్ ఉన్నాయ్ అంటూ చెప్పుకొచ్చారు.