దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణి అవుతున్నది మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఇటీవల ‘దసరా’ చిత్రంతో ఈ భామ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తన చిన్ననాటి మిత్రుడు, బిజినెస్‌మ్యాన్ ఫర్హాన్‌తో ఈ భామ గత కొంతకాలంగా ప్రేమలో ఉందనే ప్రచారం జరుగుతున్నది. కొన్ని నెలల క్రితం దుబాయ్‌లో ఈ జంట కలిసి తీయించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఫర్హాన్‌తో కలిసి ఉన్న తాజా ఫొటోను కీర్తి సురేష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకోవడంతో వీరిద్దరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. త్వరలో ఈ జోడీ పెళ్లి పీటలెక్కబోతున్నారని తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తన ప్రేమ వ్యవహారంపై కీర్తి సురేష్ ఇప్పటివరకు పెదవి విప్పలేదు. ఇటీవల ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో కూడా డేటింగ్ వార్తలన్నీ రూమర్స్ అంటూ కొట్టిపడేసింది. దీంతో ఈ అమ్మడు స్వయంగా స్పందిస్తే కానీ ప్రేమ, పెళ్లి విషయాల్లో సస్పెన్స్ వీడదని అభిమానులు అనుకు ంటున్నారు..