Keerthy Suresh | పెళ్లి తర్వాత జాక్ పాట్ కొట్టిన కీర్తి సురేష్.. దీంతో అయిన తలరాత మారుతుందా?
Keerthy Suresh | కీర్తి సురేష్.. ఈ అమ్మడు పేరు చెబితే మహానటి సినిమానే గుర్తుకు వస్తుంది. మూవీలో సావిత్రిగా నటించి అందరి మన్ననలు అందుకుంది. ఇక కీర్తి సురేష్ టాలీవుడ్ టాప్ హీరోల సరసన కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.
Keerthy Suresh | కీర్తి సురేష్.. ఈ అమ్మడు పేరు చెబితే మహానటి సినిమానే గుర్తుకు వస్తుంది. మూవీలో సావిత్రిగా నటించి అందరి మన్ననలు అందుకుంది. ఇక కీర్తి సురేష్ టాలీవుడ్ టాప్ హీరోల సరసన కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అప్పట్లో కీర్తి సురేష్ని వరుస హిట్స్ పలకరించిన ఇప్పుడు మాత్రం హిట్ దొరకడం కష్టంగా మారింది. గత కొంత కాలంగా టాలీవుడ్లో కూడా అవకాశాలు దక్కించుకోలేకపోతుంది. టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. కోలీవుడ్, బాలీవుడ్ లో మాత్రం పలు సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది.
మొదట్లో పద్దతిగా ఉన్న కీర్తి సురేష్ ఇటీవల గ్లామర్ డోస్ కూడా పెంచింది. పెళ్లయిన తర్వాత అమ్మడు గ్లామర్ షోలకు దూరంగా ఉంటుందని అంతా అనుకున్నారు దీనికి భిన్నంగా ముందుకంటే మరింతగా గ్లామర్ షోలు చేస్తూ రెచ్చిపోతుంది.రు. గత సంవత్సరం అట్లీ నిర్మాణంలో విడుదలైన బేబీ జాన్ చిత్రం ద్వారా హిందీలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్. ఆ చిత్రంతో కీర్తి బాలీవుడ్లో సత్తా చాటాలని అనుకుంది. కాని మూవీ పరాజయం చెందడంతో తిరిగి దక్షిణాది సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. రీసెంట్ గా కీర్తి సురేష్ మరో జాక్పాట్ కొట్టినట్టు తెలుస్తోంది
సార్, లక్కీ బాస్కర్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్నారట. సూర్యా 46వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతుండగా, ప్రస్తుతం ఈసినిమాకు సబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. 7 ఏళ్ల క్రితం సూర్య, కీర్తి సురేష్ కాంబినేషన్ లో గతంలో ఒక సినిమా వచ్చింది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో వీరిద్దరు జంటగా నటించారు. కాని ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా వచ్చిన దాదాపు 7 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ సూర్యతో కలిసి నటిస్తుంది. మరి ఈ చిత్రంతో అయిన అమ్మడి ఫేట్ మారుతుందా చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

