Keerthy Suresh | కీర్తిసురేశ్ పెళ్లి వార్తలపై తండ్రి సురేశ్ కుమార్ ఏమన్నాడంటే..?
Keerthy Suresh | కీర్తిసురేశ్ (Keerthy Suresh) దుబాయ్ బిజినెస్ మెన్ ఫర్హాన్ బిన్ లియాఖత్ (Farhan Bin Liaquath) బర్త్ డే సందర్భంగా అతనితో కలిసి ఉన్న స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి స్టిల్‌ను హైలెట్ చేయడంతో.. ఫర్హాన్, కీర్తిసురేశ్ పెండ్లి పీటలెక్కే అవకాశాలున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి.
Keerthy Suresh | మహానటి సినిమాతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కీర్తిసురేశ్ (Keerthy Suresh). ఓ వైపు గ్లామరస్ పాత్రలు, మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది. దుబాయ్ బిజినెస్ మెన్ ఫర్హాన్ బిన్ లియాఖత్ (Farhan Bin Liaquath) బర్త్ డే సందర్భంగా అతనితో కలిసి ఉన్న స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఓ పాపులర్ తమిళ మ్యాగజైన్లో ఈ ఇద్దరి స్టిల్‌ను హైలెట్ చేయడంతో.. ఫర్హాన్, కీర్తిసురేశ్ పెండ్లి పీటలెక్కే అవకాశాలున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలపై తాజాగా కీర్తిసురేశ్ తండ్రి, నిర్మాత జీ సురేశ్ కుమార్ స్పందించారు. కీర్తిసురేశ్, ఫర్హాన్ మంచి స్నేహితులని స్పష్టం చేశారు. కీర్తిసురేశ్ పెళ్లిపై వస్తున్న వార్తలు ఫేక్ అని, వాటిని ఎవరూ నమ్మొద్దని సురేశ్ కుమార్ కొట్టిపారేశారు.
కీర్తిసురేశ్‌ను ఒంటరిగా వదిలేయాలని సురేశ్ కుమార్ కోరారు. తన కూతురు పెళ్లి కుదిరితే.. ఆ విషయాన్ని మొదట తానే ప్రకటిస్తానని క్లారిటీ ఇచ్చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు తన వ్యక్తిగత జీవిత విషయాలను వెల్లడిస్తానని, అప్పటివరకు ఓపిక పట్టాలని రిలేషన్ షిప్ వార్తలపై కీర్తిసురేశ్ ఇప్పటికే స్పందించిన విషయం తెలిసిందే. కీర్తిసురేశ్ ప్రస్తుతం భోళా శంకర్‌లో మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో నటిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై రఘుతాత సినిమాతోపాటు మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

