Venky Anil 5 | వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మలయాళ రీమేక్ కాదు.. రూమర్లకు చెక్ పెట్టిన కీర్తి సురేష్!
Venky Anil 5 | విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతన్న సంగతి తెలిసిందే.
Venky Anil 5 | విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతన్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్, బేసిల్ జోసెఫ్ నటించిన మలయాళ సూపర్ హిట్ కామెడీ చిత్రం ‘గురువాయూర్ అంబలనాడైల్’కు ఇది రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ స్పందించి గట్టి క్లారిటీ ఇచ్చారు. ఈ రూమర్లన్నీ ముమ్మాటికీ వాస్తవ దూరం అని తేల్చి చెబుతూ, ఇది ఏ సినిమాకూ రీమేక్ కాదని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
దర్శకుడు అనిల్ రావిపూడి తన సొంత శైలిలో రాసుకున్న పక్కా ఒరిజినల్ స్క్రిప్ట్‌తో, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తూ, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్ జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రీమేక్ కాదని, స్ట్రెయిట్ ఒరిజినల్ కథేనని కన్ఫర్మ్ కావడంతో అటు విక్టరీ వెంకటేష్, ఇటు నందమూరి కళ్యాణ్ రామ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

