Keedaa Cola | పెళ్లి చూపులు (Pelli Choopulu), ఈ నగరానికి ఏమైంది (ENE) వంటి బంపర్ హిట్ల తర్వాత తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వంతో వస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola ). తరుణ్ భాస్కర్, బ్రహ్మనందం, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్లను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ‘కీడా కోలా’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చింది.
డిపిరి డిపిరి అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను కీడా కోలా యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ పాటకు భరద్వాజ్ లిరిక్స్ అందించగా.. హనుమాన్ పాడాడు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. వీజీ సైన్మా సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్, చైతన్య రావు మదాడి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
#DipiriDipiri ocheshindi! Inka masth resound raavale! #KeedaaCola
▶️ https://t.co/LI7IVaC4NlA #VivekSagar musical 🎶#KeedaaColaOnNov3@TharunBhasckerD @RanaDaggubati @VGSainma @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @saregamasouth pic.twitter.com/zUxGge2big
— Tharun Bhascker Dhaassyam (@TharunBhasckerD) October 20, 2023