Kd Movie | ఓటీటీలోకి వచ్చిన కన్నడ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కేడీ ది డెవిల్’.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్!
Kd Movie | కన్నడ స్టార్ హీరో ధృవ్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘కేడీ ది డెవిల్’ థియేటర్లలో సందడి చేసిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కన్నడలో మోస్తరు విజయాన్ని అందుకున్నప్పటికీ, తెలుగు మార్కెట్లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.
Kd Movie | కన్నడ స్టార్ హీరో ధృవ్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘కేడీ ది డెవిల్’ థియేటర్లలో సందడి చేసిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కన్నడలో మోస్తరు విజయాన్ని అందుకున్నప్పటికీ, తెలుగు మార్కెట్లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అయితే థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇంటి వద్ద నుంచే వీక్షించే అవకాశం పొందారు.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ZEE5 సొంతం చేసుకుంది. తాజాగా ‘కేడీ ది డెవిల్’ సినిమా ఈ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. కన్నడతో పాటు తెలుగు భాషలో కూడా సినిమా అందుబాటులో ఉండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ యాక్షన్ డ్రామాను వీక్షించవచ్చు. ‘కేడీ ది డెవిల్’ను దర్శకుడు ప్రేమ్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. సినిమాలో భారీ సెట్లు, గ్రాండ్ యాక్షన్ ఎపిసోడ్లు, మాస్ ఎలివేషన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ముఖ్యంగా ధృవ్ సార్జా మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
అయితే కథనం పరంగా అనవసరమైన ఓవర్ ది టాప్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం, కొన్ని సన్నివేశాలు లాజిక్కు దూరంగా వెళ్లడం వంటి అంశాలు సినిమాకు మైనస్‌గా మారినట్లు విమర్శకులు అభిప్రాయపడ్డారు. దీంతో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది. సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పోషించిన పాత్రకు మాత్రం మంచి స్పందన లభించింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా థియేటర్లలో ఆయన ఎంట్రీ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చినట్లు అప్పట్లో ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. థియేటర్లలో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన ‘కేడీ ది డెవిల్’ ఇప్పుడు జీ 5 లో కన్నడతో పాటుగా తెలుగు కూడా స్ట్రీమింగ్ అవుతుంది చూడొచ్చు . భారీ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి, ధృవ్ సార్జా అభిమానులకు ఈ చిత్రం ఒకసారి చూడదగ్గ ఎంటర్టైనర్గా నిలవొచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

