Kayadu Lohar | రీల్ లైఫ్‌లో, రియల్ లైఫ్‌లో కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలిచే స్టార్ యాక్టర్లలో టాప్‌లో ఉంటారు తమిళసూపర్ స్టార్ రజినీకాంత్. తలైవాతో ఒక్క ఫొటో దిగితే చాలనుకునేవారు కోట్లలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అనుకోకుండా ఎవరికైనా సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కలిసే అవకాశమొస్తే ఎలా ఉంటుంది.. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టమే. ఇప్పుడలాంటి అరుదైన సందర్భాన్నే సెలబ్రేట్ చేసుకుంటోంది కయాద్ లోహర్.
అల్లూరి, ఫంకీ సినిమాలతోపాటు డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది కయాదు లోహర్. ఈ బ్యూటీ బుక్ చేసుకున్న విమానంలో పక్క సీటు రజినీకాంత్దే. అవును ఫ్లైట్‌లోకి వెళ్లిన తర్వాత రజినీకాంత్‌ను చూసి ఆశ్చర్యపోవడం కయాదు లోహర్ వంతైంది. తలైవాతో సెల్ఫీ దిగిన ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన ఎక్జయిట్‌మెంట్‌ను షేర్ చేసుకుంది.
నేను ఇంకా కలగంటున్నాననే అనిపిస్తోంది.. ఆయనకు వీరాభిమానిగా ఉండటం నుంచి అనుకోకుండా ఓ విమాన ప్రయాణంలో రజినీకాంత్ సార్ పక్కనే కూర్చునే చాన్స్ దక్కడం వరకు.. ఇది నిజంగా జరిగిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. రజినీ సార్‌ను చూడగానే నా మదిలో సుందరి పాట మోగడం మొదలైంది. దీంతో నేను ఓ అద్భుతమైన లోకంలో విహరిస్తున్నట్టుగా అనిపించింది. ఈ రోజు కల సార్థకమైంది. ఏదో ఒక రోజు నేను ఆయనతో కలిసి నటించే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఇప్పుడీ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. రాబోయే రోజుల్లో కయాదు లోహర్, తలైవా కాంబోలో ఏదైనా సినిమా వస్తుందా అనేది చూడాలి మరి.