Kavya Thapar | ఆఫర్ ఇస్తానని పిలిచి అది అడిగాడు.. వార్నింగ్ ఇచ్చి తిరిగొచ్చేశా: కావ్యా థాపర్
టాలీవుడ్ బిజీ హీరోయిన్స్‌లో కావ్యా థాపర్ ఒకరు. ఓటీటీ మూవీ ‘ఏక్ మినీ కథ’ ఆమె తొలిహిట్ కాగా, ఫస్ట్ థియేటర్ హిట్ ‘ఊరుపేరు భైరవకోన’. పూరీ జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్', రవితేజ ‘ఈగల్', గోపీచంద్ ‘విశ్వం’ సినిమాలతో బిజీ హీరోయిన్గా అవతరించింది కావ్యా థాపర్.
టాలీవుడ్ బిజీ హీరోయిన్స్‌లో కావ్యా థాపర్ ఒకరు. ఓటీటీ మూవీ ‘ఏక్ మినీ కథ’ ఆమె తొలిహిట్ కాగా, ఫస్ట్ థియేటర్ హిట్ ‘ఊరుపేరు భైరవకోన’. పూరీ జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’, రవితేజ ‘ఈగల్’, గోపీచంద్ ‘విశ్వం’ సినిమాలతో బిజీ హీరోయిన్గా అవతరించింది కావ్యా థాపర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవం గురించి ఆమె మాట్లాడుతూ ‘నేను నటిని కావడం మా నాన్న కల. ఆ కల నిజం చేయడానికే మోడలింగ్‌లోకి అడుగుపెట్టా. మోడల్‌గా వచ్చిన గుర్తింపే, తర్వాత కాలంలో నన్ను హీరోయిన్ని చేసింది.
కెరీర్ పరంగా ఇప్పుడు సంతృప్తిగా ఉన్నా. భవిష్యత్ కూడా ఆశాజనకంగానే ఉంది. అయితే, నాకు ఈ స్థాయి తేలిగ్గా రాలేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. మోడలింగ్ చేస్తున్న కొత్తలో ఓ వ్యక్తి ఆఫర్ ఇస్తానని నన్ను తన ఆఫీస్‌కి పిలిచాడు. తీరా వెళ్లాక, ‘కమిట్మెంట్ ఇస్తే నాలుగు యాడ్స్ ఆఫర్ ఇస్తా..’ అన్నాడు.
నాకు అలాంటివి ఇష్టం ఉండదనీ, మరోసారి పిలవొద్దని వార్నింగ్ ఇచ్చి తిరిగొచ్చేశాను. గ్లామర్ ఫీల్డ్‌లో ఇలాంటివి సహజమని అప్పుడే అర్థమైంది. అందుకే.. బలహీనతలకు దూరంగా.. ఆత్మగౌరవంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నా. దేవుడి దయవల్ల ఆ తర్వాత నాకు అలాంటి అనుభవాలేం ఎదురుకాలేదు.’అంటూ చెప్పుకొచ్చింది కావ్య థాపర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

