Pa Pa Movie | తెలుగులోకి మరో బ్లాక్‌బస్టర్ తమిళ్ సినిమా.. ఈ నెల 13న గ్రాండ్ రిలీజ్
Pa Pa Movie | కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ "డాడా" ఇప్పుడు తెలుగులోకి వస్తుంది. "పా పా" పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. గణేశ్ కే బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జేకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
Pa Pa Movie | కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ “డాడా” ఇప్పుడు తెలుగులోకి వస్తుంది. “పా పా” పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. గణేశ్ కే బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జేకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నెల 13న పాపా సినిమాను రిలీజ్ చేయనున్నారు. నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పా పా చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్ చేతుల మీదుగా మంగళవారం నాడు రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ పా పా మూవీ ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ తో పాటు వారి బాబు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోవాలి. కొత్త ప్రొడ్యూసర్ నీరజ కోటకు ఈ చిత్రంతో ఘన విజయం దక్కాలి.’ అని ఆకాంక్షించారు.
సురేష్ కొండేటి ఏ సినిమా సక్సెస్ అవుతుందో బాగా గెస్ చేయగలడని అన్నారు.
దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ.. ‘ సురేష్ కొండేటి ఎన్నో తమిళ చిత్రాలను తెలుగులోకి తీసుకొచ్చారు. బడ్జెట్లో చేసిన తమిళ చిత్రాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. “డా డా ” సినిమా తమిళంలో 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే తెలుగులో “పా పా” పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ ఆకట్టుకుంది. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాత నీరజ కోటకి పేరు, డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా.’ అని అన్నారు.
ప్రొడ్యూసర్ నీరజ కోట మాట్లాడుతూ..’ మా జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద చేస్తున్న ఫస్ట్ మూవీ “పా పా”. ఈ చిత్రం తమిళంలో”డా డా ” పేరుతో రిలీజై ఘన విజయాన్ని సాధించింది. అలాంటి విజయమే తెలుగు ప్రేక్షకులు కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నా. ఈ రోజు మా మూవీ ట్రైలర్ లాంచ్‌కు వచ్చి సపోర్ట్ అందించిన డైరెక్టర్స్ కోదండరామిరెడ్డికి, బి. గోపాల్‌కు థ్యాంక్స్ అని’ చెప్పారు.
ప్రొడ్యూసర్ నీరజ కోట భర్త శశికాంత్ మాట్లాడుతూ.. మనుషులుగా మనం ఎంత ఆధునిక జీవితాన్ని సాగిస్తున్నా మనలోని హ్యూమన్ ఎమోషన్స్, విలువలు మారవు. అవి అలాగే ఉంటాయని చెప్పే చిత్రమిది. మేము ఈ చిత్రాన్ని తీసుకున్నాక.. ఇండస్ట్రీలోని కొందరు పెద్ద మనుషులు తమకు సినిమా ఇవ్వమని ఒత్తిడి చేశారు. ఆ ప్రెజర్ ను మాటల్లో చెప్పలేము. ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన కూడా చేశాం. అయితే రీమేక్ చేస్తే ఒరిజినల్ మూవీలోని ఎమోషన్స్ పండవని అనిపించింది. ఒక మంచి హ్యూమన్ వ్యాల్యూస్, ఎమోషన్స్ ఉన్న చిత్రం పా పా’ అని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

