Phone Bhoot Trailer | గతకొంత కాలంగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ పరిశ్రమకు ‘భూల్భూలైయా-2’ ఊపిరి పోసింది. హార్రర్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. కాగా ఇదే జానర్తో బాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తున్న చిత్రం ‘ఫోన్బూత్’. కత్రినా కైఫ్, ఇషాన్, సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్ను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. కాగా తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.
తాజాగా రిలీజైన ఫోన్బూత్ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. కత్రినా ఈ చిత్రంలో దెయ్యంగా కనిపించనుంది. కాకాపోతే వైలెంట్ దెయ్యంలా కాకుండా సాఫ్ట్ దెయ్యంలా నటించింది. ఇక సిద్ధంత్ చదుర్వేది, ఇషాన్లకు ఈ చిత్రంలో దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కత్రినా వీళ్లతో కలిసి ఫోన్బూత్ అనే బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ఫోన్లో ఒకటి నొక్కితే ఆత్మలు, దయ్యాలు.. రెండు నొక్కితే మంత్రగత్తెలకు కనెక్ట్ అవుతుంది అని ట్రైలర్లో చూపించారు. ఈ నేపథ్యంలోనే ఆత్మలతో జెనరేట్ అయ్యే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మించారు.