‘కథ కంచికి మనం ఇంటికి’ చిత్రం విభిన్నమైన హారర్ కామెడీతో ఆకట్టుకుంటుందని చెప్పారు త్రిగున్. ఆయన హీరోగా చాణక్య చిన్న దర్శకత్వంలో మోనిష్ పత్తిపాటి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకులముందుకు రానుంది. త్రిగున్ మాట్లాడుతూ ‘ గ్రాఫిక్స్, భారీ సెట్స్‌తో ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురిచేస్తుంది. ైక్లెమాక్స్ ఘట్టాలు చాలా కొత్తగా అనిపిస్తాయి.
ప్రేక్షకులు ఆసాంతం నవ్వుతూ సినిమాను ఆస్వాదిస్తారు. మా ఇంట్లో అందరి పేరులో శివుడు ఉంటుంది. అందుకే నేను శివుడి పేరు వచ్చేలా త్రిగున్ అని మార్చుకున్నా. నేను అదృష్టాన్ని నమ్ముతా. పదిహేనేళ్ల వయసులో తమిళ ‘హ్యాపీడేస్’కు నాలుగు వేల మందిని ఆడిషన్ చేస్తే అందులో సెలెక్ట్ అయ్యాను. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ప్రయోగాలు చేయాలి. అందుకే వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తున్నా’ అన్నారు.