తెలుగు సినీ దర్శకుల సంఘం నూతన అధ్యక్షుడిగా కాశీవిశ్వనాథ్ ఎన్నికయ్యారు. దర్శకుల సంఘం ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా కాశీవిశ్వనాథ్, జనరల్ సెక్రటరీగా వీఎన్ ఆదిత్య, ట్రెజరర్‌గా భాస్కర్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్‌గా మేర్లపాక గాంధీ, జీఎస్‌రావు, జాయింట్ సెక్రటరీలుగా కృష్ణమోహన్ అనుమోలు, పెండ్యాల రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కొల్లి రామ్‌గోపాల్, దొండపాటి వంశీకృష్ణ విజయాన్ని సాధించారు. కాశీవిశ్వనాథ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన సభ్యుల్లో అత్యధికులు విజయాన్ని అందుకోగా సముద్ర, చంద్రమహేష్ ప్యానల్ నుంచి ఇద్దరేసి సభ్యులు గెలుపొందారు. ఈ నెల 18వ తేదీనాడు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నది.