రుద్రుడై దిగొచ్చే దేవుడు
వినూత్న కథా చిత్రాలు, పాత్రలపరంగా ప్రయోగాలతో తమిళ, తెలుగు భాషల్లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు అగ్ర హీరో సూర్య. అయితే గత కొంతకాలంగా ఆయన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాల్ని సాధించడం లేదు. దీంతో భారీ విజయంతో వరుస ఫ్లాప్‌లకు బ్రేక్ వేయాలనే సంకల్పంతో ఉన్నారాయన.
వినూత్న కథా చిత్రాలు, పాత్రలపరంగా ప్రయోగాలతో తమిళ, తెలుగు భాషల్లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు అగ్ర హీరో సూర్య. అయితే గత కొంతకాలంగా ఆయన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాల్ని సాధించడం లేదు. దీంతో భారీ విజయంతో వరుస ఫ్లాప్‌లకు బ్రేక్ వేయాలనే సంకల్పంతో ఉన్నారాయన. ఈ నేపథ్యంలో బుధవారం సూర్య పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన నటిస్తున్న 45వ సినిమా ‘కరుప్పు’ తాలూకు టీజర్‌ను విడుదల చేశారు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది.
‘కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు..మనసులో మొక్కుకొని మిరపకాయలు దంచితే రుద్రుడై దిగొచ్చే దేవుడు..’ అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ప్రారంభమైన టీజర్ మాస్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంది. సూర్య భిన్న పార్శాలు కలిగిన పాత్రలో కనిపించారు. కంప్లీట్ మాస్ అవతార్‌లో ఆయన అభిమానుల్ని మెప్పించేలా ఉన్నారు. త్రిష, ఇంద్రన్స్, నట్టి, స్వసిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్, నిర్మాతలు: ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, రచన-దర్శకత్వం: ఆర్జే బాలాజీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

