Karuppu Movie | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. విడుదలైన ఏడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 207 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సూర్య కెరీర్లోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటి గురువారం వర్కింగ్ డే అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలకడగా రాణించింది. ముఖ్యంగా తమిళ వెర్షన్ వసూళ్లు ఈ భారీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన ఈ చిత్రంలో సూర్య, త్రిషలతో పాటు దర్శకుడు ఆర్జే బాలాజీ, శివద, యోగి బాబు, స్వాసిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సూర్య సరికొత్త మాస్ అవతారంలో కనిపించిన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది.
#Karuppu MEGA BLOCKBUSTER 🔥🔥🔥🔥 @Suriya_offl ❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/CeTOaOdawY
— RJ Balaji (@RJ_Balaji) May 21, 2026