కాజల్ కార్తీక
ఆహా: ఏప్రిల్ 9, తారాగణం: కాజల్, రెజీనా తదితరులు, దర్శకుడు: డీకే
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘కాజల్ కార్తీక’. మొదటిసారి కాజల్ దయ్యం పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో రెజీనా కీలకపాత్ర పోషించింది. ‘కరుంగాపియం’ అనే తమిళ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. కథలోకి వెళ్తే.. లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ఉమాదేవి (రెజీనా కసాండ్రా) పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటుంది. స్నేహితురాలి సలహాతో పాత లైబ్రరీకి వెళుతుంది. అక్కడ ఆమెకు ‘కాటుక బొట్టు’ అనే పుస్తకం కనిపిస్తుంది. ఆ పుస్తకాన్ని చదువుతున్న క్రమంలో అందులోని పాత్రలన్నీ ఒక్కొక్కటిగా ఆమె ముందుకు వస్తాయి. అలా దయ్యాలుగా రెజీనా ముందుకు వచ్చిన వారిలో కార్తీక (కాజల్ అగర్వాల్) కూడా ఉంటుంది. కార్తీక ఎందుకు దయ్యంగా మారింది? ఉమాదేవి ముందుకు ఎందుకు వచ్చింది? అసలు కార్తీక ఎలా చనిపోయింది? దానికి కారణం ఎవరు? తనకు అన్యాయం చేసిన వారిపై ఆమె ఎలా పగ సాధించింది? అన్నది మిగిలిన కథ.