Sardar Movie | కార్తీ ‘సర్దార్ 2’ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే.!
Sardar Movie | తమిళం నుంచి వచ్చి తెలుగులో స్టార్ నటుడిగా ఎదిగాడు కార్తీ. యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఆవారా, నా పేరు శివ, ఖాకీ, ఖైదీ పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో స్టార్ నటుడిగా ఎదిగాడు. ఇక కార్తీ గతేడాది నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సర్దార్ (Sardar).
Sardar Movie | తమిళం నుంచి వచ్చి తెలుగులో స్టార్ నటుడిగా ఎదిగాడు కార్తీ. యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఆవారా, నా పేరు శివ, ఖాకీ, ఖైదీ పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో స్టార్ నటుడిగా ఎదిగాడు. ఇక కార్తీ గతేడాది నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సర్దార్ (Sardar).
పీఎస్ మిత్రన్ (PS Mithran) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీక్వెల్‌ను అయితే ప్రకటించారు కానీ ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఇప్పుడు తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. సర్దార్ 2 షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కార్తీ ప్రస్తుతం మేయాలగన్ అనే సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఈ చిత్రం కంప్లీట్ అయిన అనంతరం సర్దార్ 2 స్టార్ట్ చేయనున్నాడు.
ఇక సర్దార్ 2 సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. పార్ట్ 1కు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. సీక్వెల్‌కు అతడి స్థానంలో మరో సంగీత దర్శకుడిని తీసుకొని.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్. అంతేకాదు సీక్వెల్లో స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించబోతున్నాడు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ఇవి కూడా చూడండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

