Sardar 2 | కార్తీ ‘సర్దార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్!
Sardar 2 | కార్తీ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది.
Sardar 2 | కార్తీ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ సినిమాను సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది.
ఈ సీక్వెల్లో కార్తీ సరసన మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు ఎస్జే సూర్య ‘బ్లాక్ డాగర్’ పాత్రలో పవర్ఫుల్ విలన్‌గా కనిపించనున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రముఖ కమెడియన్ యోగి బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ, విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లను దిలీప్ సుబ్బరాయన్ కంపోజ్ చేశారు. ఫస్ట్ పార్ట్‌కు మించిన యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ‘సర్దార్ 2’ రానుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

